E.G: ఇటీవల హాస్పటల్స్‌లో వైద్యం చేయించుకుని ఆర్ధిక సహాయం కోసం సీఎం సహాయనిధికి ధరఖాస్తు చేసుకున్న ఐదుగురికి రూ.10,47,292లు CMRF నుంచి మంజూరు అయ్యింది. కాగా, ఆ చెక్కులను శనివారం మండపేట TDP కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు బాధిత కుటుంబాలకు అందజేశారు.