RR: హైడ్రా చెరువుల అభివృద్ధిలో రెండో దశపై దృష్టి సారించింది. మొదటి దశ పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో 14 చెరువులను రెండో దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రామచంద్రపురం గంగారం, ఈర్ల చెరువులను పరిశీలించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గంగారం చెరువు 111 ఎకరాలు, ఈర్ల చెరువు 32 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు తెలిపారు.