ADB: జిల్లాలో మహిళల భద్రత, రక్షణ చర్యలు పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు, జిల్లా పోలీసు యంత్రాంగం మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యతను కేటాయిస్తుందని SP అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం బోథ్ పోలీస్ స్టేషన్లో మహిళా పోలీసు సిబ్బంది నిత్యవసర అవసరాల నిమిత్తం ప్రత్యేకంగా నూతన గదిని SP ప్రారంభించారు. మహిళల రక్షణకై షీ టీం 24 గంటలు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.