చైనా(China)లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ దక్కింది. మెన్స్ హాకీ ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు జపాన్ (Japan)పై ఘన విజయం సాధించి బంగారు పతకం నెగ్గింది. ఈ స్వర్ణంతో కలిపి ఈ ఆసియాడ్‌లో భారత్ ఇప్పటి వరకు సాధించిన మొత్తం గోల్డ్ మెడల్స్ సంఖ్య 22కు చేరింది. హాకీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ (India) ఆది నుంచీ ఆదిపత్యం కనబర్చింది. చివరికి 5-1 గోల్స్ తేడాతో జపాన్ను చిత్తుచేసింది. ఈ గెలుపు ద్వారా భారత్ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకోవడమేగా 2024లో జరిగే పారిస్ ఒలింపిక్స్ బెర్తును కూడా కన్ఫామ్ చేసుకుంది. కాగా, ఈ పతకంతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటివరకు మొత్తం 4 బంగారు పతకాలు (Gold medals) గెలిచినట్లయ్యింది.
దాంతో ఆసియాడ్‌లో ఇప్పటివరకు 4 గోల్డ్ మెడల్స్ గెలిచిన దక్షిణకొరియా రికార్డును భారత్ సమం చేసింది. కాగా, ఆసియాడ్(Asiad)లో ఇప్పటివరకు అత్యధిక స్వర్ణాలు గెలిచిన రికార్డు పాకిస్థాన్ పేరిట ఉంది. పాక్ ఆసియా క్రీడల్లో మొత్తం 9 గోల్డ్ మెడల్స్ గెలుచుకుంది. అద్బుత ప్రదర్మనతో భారత్ వరుసగా 7 మ్యాచ్‌లు గెలిచి తన అధిపత్యాన్ని కొనసాగించింది. ఆసియా క్రీడల పురుషుల హాకీ(Hockey)లో భారత్ స్వర్ణం గెలవడం ఇది నాలుగోసారి. 1966, 1998, 2014 ఆసియా క్రీడల్లోనూ భారత్ హాకీ ఈవెంట్ లో విజేతగా నిలిచింది. ప్రస్తుతం చైనాలోని హాంగ్ ఝౌ (Hong Zhou) నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత స్వర్ణాల సంఖ్య 22కి పెరిగింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 95 పతకాలు ఉన్నాయి. వాటిలో 34 రజతాలు, 39 కాంస్యాలు కూడా ఉన్నాయి.