ASR: గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో శనివారం పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సురేష్ వాహనదారులు తప్పనిసరిగా అన్ని పత్రాలు వెంట ఉంచాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు రూ.10,000 జరిమానా విధిస్తామని తెలిపారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.