SRCL: సర్వాంగ సుందరంగా వేములవాడ పట్టణాన్ని తీర్చి దిద్దుతానని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని బ్రిడ్జి నుంచి ఆలయం వరకు జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. సుమారు రూ. 46 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్తంభాల పనులను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరిశీలించారు.