GNTR: ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని పొన్నూరు ఏరియా సీపీఐ కార్యదర్శి సత్యనారాయణ డిమాండ్ చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇస్తామన్న వాగ్దానాలు ఇంకా అమలు కాలేదని ఆయన విమర్శించారు. ఈ డిమాండ్ల సాధనకై మార్చి 24న పెదకాకాని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.