»Two Terrorists Killed In Encounter In Jammu And Kashmirs Kulgam District
Encounter: కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
కుల్గాం జిల్లాలో కార్టన్ సెర్చ్‌లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీపై కాల్పులు జరిపారు.
Two terrorists killed in encounter in Jammu and Kashmir's Kulgam district
Encounter: జమ్మూకశ్మీర్‌లోని (Jammu Kashmir) కుల్గాం జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. మృతదేహాలను ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి హతమైన ఉగ్రవాదుల మృతదేహాలను వెలికితీస్తున్నారు. ద కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని కశ్మీర్ పోలీస్ జోన్ ఎక్స్‌లో పోస్టు చేశారు.
జమ్మూలో ఉగ్రవాదుల కదిలికను పసిగట్టే క్రమంలో భాగంగా బుధవారం ఉదయం భద్రతా బలగాలు కుల్గాం జిల్లాలోని పలు ప్రాంతాలలో కుంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో తారసపడిన ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. కుల్గాంలోని కుజ్జర్ ప్రాంతంలో ఎన్కౌంటర్ మొదలైంది. పోలీసులు, భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నాయని కశ్మీర్ జోన్ పోలీసు విభాగం వెల్లడించింది. రాజౌరీ జిల్లా కలకోటె అటవీ ప్రాంతంలో దాక్కున్న అనుమానిత ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు మూడు రోజులుగా గాలిస్తున్నాయి. సోమవారం ఉగ్రవాదులు ఎదురు కాల్పులు జరపడంతో ఇద్దరు ఆర్మీ సిబ్బంది గాయపడ్డారు. దాంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నిఘా పరికరాలతో ఉగ్రవాదుల కోసం వేట ప్రారంభించారు.