కృష్ణా: కంకిపాడు హైవేపై ఫ్లైఓవర్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు గాయపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్లు ఢీకొనడంతో వారు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. కంకిపాడు, ఈడుపుగల్లు ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరరుకున్నారు.