TG: నిజామాబాద్ పదో తరగతి హిందీ పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్షా కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు ఫోన్ తీసుకువెళ్లడాన్ని విద్యాశాఖ పూర్తిగా నిషేధించింది. స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించేలా కొత్త ట్రాకింగ్ విధానం తెచ్చింది. నిబంధనలు అతిక్రమిస్తే ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగిస్తామని హెచ్చరించింది. QR కోడ్ ఉన్నా లీకేజీలు ఆగకపోవడంతో తనిఖీలను మరింత ముమ్మరం చేయాలని నిర్ణయించింది.