AP: గుంటూరు కొర్నెపాడులో నిర్వహించిన రైతు నేస్తం ఫౌండేషన్ పదో వార్సికోత్సవంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు. మిద్దెతోటలు సాగుచేస్తున్న మహిళలకు అవార్డులను అందజేశారు. మిద్దె తోటల పెంపకందారుల సమూహం ఉందని తనకు ఇప్పటివరకూ తెలియదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న రఘోత్తమరెడ్డి, వెంకటేశ్వరరావుకు అభినందనలు తెలిపారు.