WGL: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధికి పలు రంగాలకు నిధులు కేటాయించారు. దేవాదుల ప్రాజెక్టుకు రూ. 445 కోట్లు, రామప్ప, లక్నవరం వంటి పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రూ. 4 కోట్లు మంజూరు చేశారు. KUకు రూ. 40 కోట్లు, క్రీడా పాఠశాలల అభివృద్ధికి రూ. 42.80 కోట్లు, పోలీస్ కమిషనరేట్ భవనాల నిర్మాణానికి రూ. 10 కోట్లు కేటాయించారు.