MBNR: మైనార్టీ సోదరులు సంతోషంగా రంజాన్ పండుగను జరుపుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. రంజాన్ పండుగను పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సంజయ్ నగర్ ఈద్గా వద్ద మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పోద్వాల్ డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ పాల్గొన్నారు.