ASCI వాట్ ది సిగ్మా? అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. జెన్ ఆల్ఫా (7-15 ఏళ్లు) పిల్లలకు ఆన్లైన్, నిజ ప్రపంచాల మధ్య తేడా తగ్గిపోతోందని, వారి అభిరుచులను అల్గారిథమ్స్ శాసిస్తున్నాయని హెచ్చరించింది. ప్రచార చిత్రాలకు, సాధారణ వీడియోలకు మధ్య వ్యత్యాసం తెలియక వారు అయోమయానికి గురవుతున్నారని తెలిపింది.