»Prime Minister Modi Laid Foundation Stone For Rs 8021 Crore Works In Nizamabad Today
PM Modi: నేడు నిజామాబాద్‌కు ప్రధాని మోదీ..రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన!
నేడు మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలను నిర్వహించనున్నారు. ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆయన నిజామాబాద్‌కు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని మోదీ సభా స్థలికి చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సభ అనంతరం సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో బీదర్‌కు పీఎం మోదీ తిరుగు ప్రయాణం కానున్నారు. బీదర్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ప్రధాని రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాలు చేపట్టనున్నారు. తెలంగాణలో 20 క్రిటికల్ కేర్ బ్లాకులకు ఆయన శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు.
ఎన్టీపీసీ ఆధ్వర్యంలో కొత్తగా రూ.6 వేల కోట్లతో నిర్మిచిన 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు పీఎం మోదీ జాతికి అంకితం చేయనున్నారు. మరోవైపు మనోహరాబాద్- సిద్దిపేట కొత్త రైల్వే లైన్‌ను కూడా ప్రారంభిస్తారు. ధర్మాబాద్-మనోహరాబాద్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు, మహబూబ్‌నగర్- కర్నూల్ కొత్త లైన్ విద్యుదీకరణ పనులు, సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు కొత్త రైలు సర్వీస్‌ను వర్చువల్‌గా మోదీ ప్రారంభిస్తారు.