ఈశాన్య రాష్ట్రాలు అయిన అసోం, మేఘాలయాల్లో సోమవారం భూ ప్రకంపణలు సంభవించాయి. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైందని జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. సోమవారం సాయంత్రం 6.15 గంటలకు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. అలాగే మేఘాలయాలోని నార్త్ గ్యారో హిల్స్ వద్ద భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉందని వెల్లడించారు.
— National Center for Seismology (@NCS_Earthquake) October 2, 2023
అసోం, మేఘాలయాలతోపాటుగా బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనాల్లోనూ భూమి కంపించినట్లు భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. అయితే ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భూకంపం రావడంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారని, అయితే ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని వెల్లడించారు.