PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఆస్తి పన్ను బకాయిదారులు తక్షణమే స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ అరుణశ్రీ హెచ్చరించారు. భారీ బకాయిదారులకు ఇప్పటికే రెడ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. సకాలంలో పన్నులు చెల్లించని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం ఆస్తులను జప్తు చేసి వేలం వేస్తామని స్పష్టం చేశారు.