HYD: బాలాపూర్‌లోని 31 ఎకరాల భూదాన భూములను ఇళ్లు లేని పేదలకు వెంటనే పంపిణీ చేయాలని సీపీఐ, తెలంగాణ సర్వోదయ మండలి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. భూదాన యజ్ఞ బోర్డును ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాయి.