KNR: కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్లో నూతనంగా నిర్మించిన మెన్, ఆఫీసర్స్ బ్యారక్‌ను సీపీ గౌష్ ఆలం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోలీస్ సిబ్బంది సేవలను గుర్తు చేస్తూ ఆయన అభినందించారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసినందుకు రూరల్ సీఐ నిరంజన్ రెడ్డితో పాటు సిబ్బందిని ప్రశంసించారు.