NRPT: మరికల్ మండలం ఎలిగండ్లలో ఉగాది సందర్భంగా నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్లబండ్ల గిరక పోటీలు ఉత్సాహంగా సాగాయి. మొదటి బహుమతి (రూ.15,000) వడ్యాట్కు చెందిన మహాదేవప్ప, ద్వితీయ బహుమతి (రూ.10,000) బసప్ప, తృతీయ బహుమతి (రూ.5,000) మదనపల్లి రైతు లింగప్ప గెలుచుకున్నారు. సర్పంచ్ అశ్విని నరేశ్ గౌడ్ విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.