KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్కు రెండు రోజుల సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ పుల్లూరి స్వప్న తెలిపారు. రంజాన్ సందర్భంగా శనివారం ప్రభుత్వ సెలవు, ఆదివారం సాధారణ సెలవు ఉంటాయని పేర్కొన్నారు. మార్చి 23న సోమవారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందని, రైతులు, వ్యాపారులు సహకరించాలని కోరారు.