»Star Hero Prabhas Competition With Shah Rukh Khan Dunki Movie December 22nd 2023
Shahrukh khan:తో స్టార్ హీరో ప్రభాస్ పోటీ?
సోషల్ మీడియాలో స్టార్ హీరో ప్రభాస్ నటించిన సాలార్, షారుఖ్‌ఖాన్ యాక్ట్ చేస్తున్న డుంకీ చిత్రాల గురించి క్రేజీ బజ్ చక్కర్లు కోడుతుంది. అయితే ఈ రెండు చిత్రాల విడుదల తేదీ ఒకటేనని అంటున్నారు. దీంతో ప్రభాస్, షారుఖ్ కు పోటీ తప్పదని ఫ్యాన్స్ అంటున్నారు.
star hero prabhas competition with shah rukh khan dunki movie december 22nd 2023
ఈ మధ్య కాలంలో బాగా హైప్ వచ్చిన సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) నటించిన సాలార్ ఒకటి. ఈ చిత్రానికి KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. దీంతోపాటు పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, రామచంద్రరాజు, శ్రీయా రెడ్డి, ఈశ్వరీ రావు సహా పలువురు ప్రముఖులు ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. కేజీఎఫ్, కాంతారా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఇటివల సాలార్ నిర్మాతలు సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో క్రేజీ బజ్ చక్కర్లు కోడుతుంది. ఈ చిత్రం క్రిస్మస్ కు ముందు అంటే డిసెంబర్ 22న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఇదే రోజు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్‌ఖాన్(shah rukh khan) యాక్ట్ చేస్తున్న డుంకీ మూవీ కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కింగ్ ఖాన్‌తో పాటు తాప్సీ పన్ను, దియా మీర్జా, బోమన్ ఇరానీ, ధర్మేంద్ర సహా పలువురు నటీనటులు యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సి.కె.మురళీధరన్ అందించగా, సంగీతం ప్రీతమ్ సమకుర్చారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డుంకీ కూడా డిసెంబర్ 22న రిలీజ్ కావడంతో ప్రభాస్, షారుఖ్ సినిమాల మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్రమంలో తమ హీరో చిత్రం గ్రేట్ అంటే గ్రేట్ అని సోషల్ మీడియాలో మీమ్స్ చేసి హల్చల్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరి రెండు చిత్రాలను అదే రోజు విడుదల చేస్తారా ? లేదా ఏదైనా చిత్రం పోస్ట్ పోన్ చేస్తారా అనేది చూడాలి.