Shreyas Iyer started the trend with a century.. India is heading for a big score
Shreyas Iyer: ఆస్ట్రేలియాతో రెండో వన్డేలో టీమిండియా బ్యాట్స్మెన్ దుమ్ముదూలిపారు. రుతురాజ్ గైక్వాడ్ 8 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు వర్షం పడింది. ఆ వెంటనే స్టార్ట్ కాగా.. శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer), శుభ్ మన్ గిల్ సెంచరీలతో కదం తొక్కాడు. అయ్యర్ 86 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో సెంచరీ కొట్టాడు. 105 పరుగులు చేసి అయ్యర్ ఔటయ్యాడు. గిల్ 92 బంతుల్లో 4 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 100 రన్స్ చేశాడు. అయ్యర్ ఔట్ కాగా క్రీజుల్లోకి కేఎల్ రాహుల్ వచ్చాడు. ఆసీస్ ముందు భారీ లక్ష్యం ఉంచాలని టీమిండియా డిసైడైంది. వచ్చిన బ్యాట్స్మెన్ అంతా ధాటిగా ఆడుతున్నారు.
ఆసీస్తో ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. రెండో వన్డేలో గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటారు. దీంతో మూడో వన్డే నామమాత్రం కానుంది. ఫస్ట్ రెండు మ్యాచ్లకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి విశ్రాంతి ఇచ్చిన సంగతి తెలిసిందే. సిరీస్ తర్వాత వన్డే వరల్ట్ కప్ ఉండనుంది. అందుకోసమే రోహిత్, కోహ్లికి రెస్ట్ ఇచ్చారు.