భారత్(bharat), కెనడా(canada) దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కడికి చదవు సహా ఉద్యోగాల కోసం వెళ్లిన భారత విద్యార్థుల పరిస్థితి గురించి..వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో తమ పిల్లలు సరిగ్గా చదువుకోలేక పోతున్నారని, ఈ వివాద సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.
భారతదేశం(bharat), కెనడా(canada) దేశాల మధ్య గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో చదువుతున్న, అక్కడ నివసిస్తున్న విద్యార్థుల..తల్లిదండ్రులు భారత్‌లో ఆందోళన చెందుతున్నారు. మా కుమార్తె కెనడాకు చదువుకోవడానికి వెళ్ళింది. ఆమె వెళ్లి ఏడు నెలలు అయ్యింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మా బిడ్డతోపాటు మేము కూడా ఆందోళన చెందుతున్నట్లు విద్యార్థుల పేరెెంట్స్(parents) చెబుతున్నారు. ఇలాంటి సమయంలో తమ బిడ్డ చదువుపై దృష్టి పెట్టలేకపోతుందని వాపోతున్నారు.
https://x.com/ANI/status/1705579314165768667?s=20
తన ఇద్దరు కుమార్తెలు కెనడాలో ఉన్నారని, తనకు టెన్షన్‌గా ఉందని భారత్‌లో ఉన్న మరో పేరెంట్ అంటున్నారు. వారు చదువుకోవడానికి అక్కడికి వెళ్లారు. ఇరు దేశాల ప్రభుత్వాలు కలిసి ఒక పరిష్కారాన్ని కనుగొనాలని కోరుతున్నారు. ఇలాంటి క్రమంలో తమ పిల్లలు(children) జాతీయత ఆధారంగా వివక్ష లేదా పక్షపాతాన్ని అనుభవించే అవకాశం ఉందని వారు భయాందోళన చెందుతున్నారు. భారతదేశం చాలా దృఢమైన దేశమని, విలువలు, నిబంధనలపై ఆధారపడి ఉంటుందని భారత్-కెనడా వివాదంపై బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎ.కె.అబ్దుల్ మోమెన్ అన్నారు. ఇది విచారకరమైన అంశమని, స్నేహపూర్వకంగా ముగుస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.
ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య నేపథ్యంలో రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్ ప్రమేయం ఉంది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(justin trudeau) వ్యాఖ్యలు చేయడంతో ఇది కాస్తా క్రమంగా పెరిగింది. ఆ తర్వాత కెనడా భారత దౌత్యవేత్తను బహిష్కరించడం, ఆ నేపథ్యంలో ఇండియా కూడా ఆ దేశానికి చెందిన దౌత్యవేత్తను ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య తీసుకున్న పలు చర్యల కారణంగా దౌత్యపరమైన ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కెనడాలో ఉన్న భారత విద్యార్థుల తల్లిదండ్రులు వారి క్షేమం గురించి ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదం తొలిగించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.