కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.. దేశంలో భారత్ జో డో యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర ఆయన దాదాపు 150 రోజుల పాటు జరగనున్నారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి ఈరోజు ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభించిన కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రానున్న 150 రోజుల పాటు కంటైనర్‌లో నిదురించనున్నారు.
రాబోయే 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ ‘మాస్టర్‌స్ట్రోక్’గా భావిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’ను కాంగ్రెస్ బుధవారం ప్రారంభిస్తోంది. 150 రోజుల పాటు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు సాగే 3,570 కిలోమీటర్ల యాత్రలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. రాహుల్ గాంధీ ఏ హోటల్లోనూ బస చేయరని, యాత్ర మొత్తాన్ని సాదాసీదాగా పూర్తి చేస్తారని పార్టీ స్పష్టం చేసింది.
రాహుల్ గాంధీ రాబోయే 150 రోజులు కంటైనర్లోనే ఉండబోతున్నారు. కొన్ని కంటైనర్లలో నిదురించేందుకు వీలుగా పడకలు, టాయిలెట్లు, ఎయిర్ కండిషనర్లు కూడా అమర్చి ఉంచారు. ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రతలు, తేమను దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేశారు.
ఇలాంటి దాదాపు 60 కంటైనర్లను సిద్ధం చేసి కన్యాకుమారికి పంపారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సామాన్య ప్రజలతో మమేకం అయ్యే మార్గంగా భావిస్తున్నారు.
బుధవారం శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద జరిగిన ప్రార్థనా సమావేశానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. శ్రీపెరంబుదూర్‌లో ఆయన తండ్రి రాజీవ్ గాంధీ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మే 21, 1991న బాంబు పేలుడులో హత్యకు గురయ్యారు.
రాహుల్ గాంధీ తన తండ్రి స్మారక చిహ్నం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘ద్వేషం, విభజన రాజకీయాల వల్ల నేను నా తండ్రిని కోల్పోయాను. వాటితో నా ప్రియమైన దేశాన్ని కూడా కోయేందుకు సిద్ధంగా లేను. ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. ఆశ భయాన్ని ఓడిస్తుంది. కలిసి మనం ద్వేషాన్ని అధిగమిస్తాం’ అని ట్వీట్ చేశారు.