ప్రస్తుతం ఏపిలో పొలిటికల్ హీట్ ఎలా ఉందో చూస్తునే ఉన్నాం. చంద్రబాబు అరెస్ట్‌తో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ హడావిడిగా ఉన్నారు. ఇలాంటి సమయంలో పెదకాపు సినిమా కోసం బాలయ్య వస్తాడా?
Pedakapu: విరాట్ కర్ణని హీరోగా పరిచయం చేస్తూ, క్లాస్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చేస్తున్న ఊరమాస్ సినిమా పెద కాపు. మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 29న రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయినా ఈ సినిమా పోస్టర్,టీజర్,ట్రైలర్‌కు మాసివ్ రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 23న సాయంత్రం 6 గంటలకు హెదరాబాద్ లో హైటెక్ సిటీ శిల్పకళావేదిక లో జరుపుతున్నట్టు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసారు.
ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎవరనేది? చెప్పలేదు. ఇండస్ట్రీ బజ్ ప్రకారం నందమూరి నటసింహం బాలకృష్ణ ముఖ్య అతిధిగా రానున్నాడని తెలుస్తోంది. పెదకాపు సినిమాను ద్వారకా క్రియేషన్స్ పై మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ సినిమాను నిర్మించింది కూడా ఆయనే. ఆ సాన్నిహిత్యంతో బాలయ్య ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. ప్రజెంట్ బాలయ్య పొలిటికల్ హడావిడిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలయ్య పెదకాపు కోసం వస్తారా? లేదా? అనేది వేచి చూడాల్సిందే. ఒకవేళ బాలయ్య గనుక ఈ సినిమా ఈవెంట్‌కు వస్తే.. పెదకాపు పై మరింత బజ్ రావడం గ్యారంటీ. ఇకపోతే ఈ సినిమాలో శ్రీకాంత్ అడ్డాల కీలక పాత్రలో నటిస్తున్నాడు. ట్రైలర్ ప్రకారం నెగెటివ్ రోల్లో కనిపించనున్నాడని చెప్పొచ్చు. హీరో విరాట్ కర్ణ సరసన ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్గా నటిస్తోంది.