»First Odi Australia Were Bowled Out For 276 Runs Mohammed Shami Took 5 Wickets
IND vs AUS: తొలి వన్డేలో ఆస్ట్రేలియా 276పరుగులకు ఆలౌట్ .. 5వికెట్లు పడగొచ్చిన మహ్మద్ షమీ
మొహాలీలో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గెలుచుకున్న భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు సరైన లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్‌కు సహాయపడే పిచ్‌పై ఆస్ట్రేలియాను 276 పరుగులకే పరిమితం చేశారు.
IND vs AUS: మొహాలీలో జరుగుతున్న తొలి వన్డేలో తొలుత టాస్ గెలుచుకున్న భారత జట్టు బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్లు సరైన లైన్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి, బ్యాట్స్‌మెన్‌కు సహాయపడే పిచ్‌పై ఆస్ట్రేలియాను 276 పరుగులకే పరిమితం చేశారు. చాలా మంది ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్లకు మంచి ఆరంభాలు లభించాయి, కానీ ఎవరూ ఈ ఇన్నింగ్స్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ మాత్రమే అత్యధికంగా 52 పరుగులు చేశాడు. జోష్ ఇంగ్లిస్ 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, మార్నస్ లాబుషాగ్నే 39 పరుగులతో ఇన్నింగ్స్ ఆడారు. భారత్ తరఫున ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. షమీ తన 10 ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 51 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు.
కాసేపు వర్షం కారణంగా ఇండియా-ఆసీస్ జట్ల మధ్య మొదటి వన్డే నిలిచిపోయింది. ఆ సమయంలో 35.4 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు ఆస్ట్రేలియా సాధించింది. వర్షం కారణంగా దాదాపు 15 నిమిషాలు ఆగింది. 276 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ కాగా భారత్ విజయం సాధించాలంటే 277 పరుగులు చేయాల్సి ఉంటుంది. మహ్మద్ షమీ 5 వికెట్లు తీసి ఆస్ట్రేలియా జట్టు క్రికెటర్లు ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నాడు. తర్వాత బుమ్రా, అశ్విన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు.