Sai Pallavi: ఎట్టకేలకు సాయి పల్లవి సంతకం చేసేసింది!
లేడీ పవర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి.. ఎట్టకేలకు ఓ కొత్త సినిమాకు సంతకం చేసేసింది. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉంటు వచ్చిన సాయి పల్లవి.. మరోసారి నాగ చైతన్యతో రొమాన్స్ చేసేందుకు సై అంటోంది.
చివరగా ‘గార్గి’ అనే డబ్బింగ్ సినిమాతో ఆడియెన్స్‌ను పలకరిచింది సాయి పల్లవి. కానీ తెలుగులో ‘విరాట పర్వం’ తర్వాత మరో తెలుగు ప్రాజెక్ట్‌కు సైన్ చేయలేదు. దీంతో అమ్మడు ఇక సినిమాలు మానేస్తుంది.. వైద్య రంగంలో సెటిల్ అయిపోతుందని.. ప్రస్తుతం హాస్పిటల్ నిర్మాణ పనులతో బిజీగా ఉందని ప్రచారం జరిగింది. కానీ తమిళ్లో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమా అనౌన్స్ చేసింది. అయినా కూడా తెలుగు సినిమాలు ఎందుకు చేయడం లేదనేది హాట్ టాపిక్‌గా మారింది. కానీ సాయి పల్లవికి సరైన స్క్రిప్ట్ కుదరక పోవడం వల్లే తెలుగు సినిమాలకు ఒప్పుకోవడం లేదని వినిపించింది.
ఈ విషయంలో ఆమె అభిమానులు అప్సెట్ అవుతునే ఉన్నారు. అయితే ఎట్టకేలకు ఓ తెలుగు సినిమాకు సంతకం చేసేసింది సాయి పల్లవి. గతంలో నాగ చైతన్యతో కలిసి ‘లవ్ స్టోరీ’ సినిమాలో నటించిన సాయి పల్లవి.. మరోసారి చైతన్యతో రొమాన్స్ చేసేందుకు ఓకె చెప్పింది. ప్రస్తుతం కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో కలిసి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నాడు నాగ చైతన్య. ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి ఓకె అయింది.
తాజాగా ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయినట్టుగా ప్రకటించారు మేకర్స్. అందుకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసిన మేకర్స్.. అందులో సాయి పల్లవి ఫేస్ చూపించకుండా సస్పెన్స్‌లో ఉంచారు. కానీ ఇప్పుడు ఆమె ఫోటోని షేర్ చేశారు. ఇక గీత ఆర్ట్స్ 2 బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ #NC23 అనే వర్కింగ్ టైటిల్‌తో ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది. కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది.