MLG: కోయగుడ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్లో సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పోరీక సరిత ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులను సకాలంలో పూర్తిచేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సర్పంచ్ సూచించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు జయకృష్ణ, తదితరులు ఉన్నారు.