బీహార్లోని నలంద జిల్లా(Nalanda District)లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రజల దగ్గర నుండి వసూలు చేసిన లంచం విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య వివాదం చేలరేగింది. రోడ్డుపైనే ఒకరినొకరు బాహాబాహీ(Bahabahi)కి దిగారు. గళ్లాలు పట్టుకొని మరీ పోలీసులు కొట్టకున్నారు. హైవే పైన వెళుతున్న వాహనదారులు ఆగి సినిమాలాగా చూశారు. చుట్టూ గుమికూడిన వాళ్లు వారిస్తున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఒకరేమో వాహనంలోని లాఠీని తీసుకొచ్చి కొట్టేందుకు ప్రయత్నించగా మరో పోలీసు ఆ పక్కనే ఉన్న చెట్టు కొమ్మను విరిచి దాడికి ప్రయత్నించాడు. ఇదంతా అక్కడున్న వారు తమ మొబైల్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియా(Social media)లో పెట్టడంతో అదికాస్తా వైరల్ గా మారింది. పోలీసుల ప్రవర్తనపై నెటిజన్లు (Netizens) మండిపడుతూ కామెంట్లు పెడుతున్నారు.
సోషల్ మీడియా ద్వారా విషయం బయటకు రావడంతో బీహార్ పోలీస్ (Bihar Police) ఉన్నతాధికారులు స్పందించారు. రోడ్డు మీద కొట్టుకున్న ఆ పోలీసులు ఇద్దరిపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఇద్దరు పోలీసుల మధ్య గొడవ జరగడంతో వారిని విడదీయడం కష్టంగా మారింది. ఈ ఘటన తర్వాత పోలీసుల సేవ సామాన్యుల్లో నవ్వులాటగా మారింది. వీడియోలో ప్రజలు పోలీసులను దుర్భాషలాడుతున్నారు. ‘‘వీళ్లలో వీళ్లే కొట్టుకుంటున్నారు, ఇక ప్రజల మీద జరిగే దాడులకు వీళ్లేం స్పందిస్తారంటూ’’ అక్కడ ఉన్నవాళ్లే కామెంట్ చేస్తున్నారు. ఈ విషయానికి సంబంధించి, రాహుయ్ పోలీస్ స్టేషన్ ఇంచార్జి నందన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, వైరల్ అయిన వీడియోలో ఉన్న పోలీసులు ఇద్దరూ రాహుయ్ పోలీస్ స్టేషన్(Rahui Police Station)కు చెందినవారు కాదని అన్నారు. వీరిలో 112 మంది ఎమర్జెన్సీ సర్వీస్ పోలీసులు ఉన్నారని తెలిపారు.