»Nara Lokesh And Tdp Ex Mp Mouna Deeksha At Rajghat In Delhi
Nara Lokesh: గాంధీ సమాధి వద్ద నారాలోకేష్ మౌన దీక్ష
ఢిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్ ఘాట్ వద్ద టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) సహా పలువురు మాజీ ఎంపీలు కలిసి మౌనదీక్ష చేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) దేశ రాజధాని ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని గాంధీజీ సమాధి రాజ్ ఘాట్(rajghat) వద్దకు లోకేష్ తోపాటు పలువురు టీడీపీ నేతలు చేరుకుని నివాళులర్పించారు. ఆ తర్వాత అక్కడే కూర్చుని నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా మౌనదీక్ష చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా పాల్గొన్నారు.
చంద్రబాబు నాయుడు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఎంపీ నారాయణ అన్నారు. తమకు న్యాయం, ధర్మంపై నమ్మకం ఉందని పేర్కొన్నారు. నాయస్థానంలో ఈరోజు తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే గత నాలుగు రోజులుగా నారా లోకేష్ ఢిల్లీ(delhi)లోనే ఉన్నారు. పలు జాతీయ మీడియా సంస్థలకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తు చంద్రబాబు నాయుడు అరెస్టు గురించి న్యాయ నిపుణలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి క్రమంలో ఈరోజు తీర్పు బాబుకు అనుకూలంగా ఉంటుందా? లేదా వ్యతిరేకంగా వస్తుందా అనేది తెలియాలంటే ఇంకాస్తా సమయం ఆగాల్సిందే.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP assembly session 2023) రెండో రోజు వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు మొదలు కాగానే టీడీపీ సభ్యులు(tdp members) స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ విజిల్ వేస్తు నిరసన తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ చేపట్టాలని టీడీపీ సభ్యులు డిమాండ్ చేశారు.