»Key Information With Isro Aditya L1 Said Good News
Aditya L1: గుడ్‌న్యూస్ చెప్పిన ఇస్రో.. ఆదిత్య ఎల్ 1తో కీలక సమాచారం!
ఇస్రో చేపట్టిన ఆదిత్య ఎల్1 మిషన్ గుడ్ న్యూస్ చెప్పింది. సూర్యుడి గురించి అధ్యయనం చేయడంలో పనుల వేగాన్ని పెంచినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో (ISRO) చంద్రయాన్3 ప్రయోగంతో సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూర్యుడిపైకి వెల్లేందుకు పలు ప్రయోగాలను చేపట్టనున్నట్లు వెల్లడించింది. అందులో భాగంగా సెప్టెంబర్ 2వ తేదిన ఆదిత్య ఎల్1 మిషన్‌ను చేపట్టింది. ఈ నేపథ్యంలో సూర్యుడి వైపు క్రమంగా వెళ్తోన్న ఈ మిషన్‌కు సంబంధించిన విషయాలను ప్రజలకు తెలియజేస్తూ వస్తోంది.
తాజాగా ఆదిత్య ఎల్1 (Aditya L1)కు సంబంధించిన కీలక అప్డేట్ను ఇస్రో అందించింది. ఈ ప్రయోగంలోని పరికరాలు తమ పనిని ప్రారంభించాయని ఇస్రో ట్వీట్ చేసింది. ఈ మిషన్‌లో అమర్చిన సెన్సార్లు తమ పనిని మొదలు పెట్టినట్లు తెలిపింది. సూర్యుడి గుట్టు విప్పేందుకు ఈ మిషయన్ విస్తృత పరిశోధనలు చేయనున్నట్లు వెల్లడించింది.
ఆదిత్య ఎల్1 మిషన్.. భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్1 వద్దకు మాత్రమే చేరుకుంటుంది. ఇందుకోసం 120 రోజుల సమయం పడుతుంది. ఆ పాయింట్ నుంచే అది ప్రయాణిస్తూ సూర్యుడి గురించి అధ్యయనం చేయనుంది. ఈ మిషన్ ద్వారా సౌర జ్వాలలు, సౌర రేణువులతో పాటు అక్కడి వాతావరణం గురించి మరింత సమాచారం తెలియనుంది.