జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)పై ఏపీ మంత్రి రోజా మరోసారి మండిపడ్డారు. చంద్రబాబుది అక్రమ కేసు కాదని, అడ్డంగా దొరికిపోయిన కేసు అని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ (Skill development) లో 13 చోట్ల సంతకాలు పెట్టి చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారని తెలిపారు. ఈ కేసులో ఈడీ, ఐటీ, జీఎస్టీ(GST)లు కూడా విచారణ జరిపాయని తెలిపారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకున్న పవన్ తన అభిమానులను మోసం చేశారని అన్నారు. చంద్రబాబు (Chandrababu) ఏ తప్పూ చేయకపోతే ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు.
కనీసం వార్డు మెంబర్ గా కూడా గెలవలేని పవన్.. సీఎం జగన్ (CM Jagan) ను ఏం చేయగలరని ఎద్దేవా చేశారు. చంద్రబాబునే ఏమీ చేయలేని బాలకృష్ణ.. జగన్ ను ఏం చేస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు సీట్లో బాలకృష్ణ (Balakrishna) కూర్చున్న 24 గంటల్లోనే పవన్ కల్యాణ్ ను రంగంలోకి దించారని విమర్శించారు. బాలకృష్ణ.. తన తండ్రి మీద చెప్పులేసిన చంద్రబాబునే ఏమీ చేయలేకపోయాడు. ఇంక, సీఎం జగన్ను ఏం చేయగలడు. నిజంగా స్కిల్ కుంభకోణంలో చంద్రబాబుకు తప్పు చేయకపోతే సీబీఐ(CBI), ఈడీ విచారణ కోరాలి అని కామెంట్స్ చేశారు.