విషాదకర వార్త చదువుతూ లైన్లో నవ్విన న్యూస్ యాంకర్‌పై నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బిహార్(Bihar)కు చెందిన న్యూస్ ఛానెల్.. భాగమతి నది (Bhagmati river) వరద బీభత్సంపై న్యూస్ రిపోర్ట్ చేసింది. స్టూడియో నుంచి వార్త చదువుతూ యాంకర్ తప్పు పదం పలికి, నవ్వారు.. తర్వాత క్షమాపణ కోరారు. ఈ వీడియో వైరల్ కాగా.. ‘ అక్కడ జనాలు చచ్చిపోతుంటే నీకు నవ్వొస్తుందా?’ అని నెటిజన్లు పైర్ అవుతున్నారు. బీహార్ & జార్ఖండ్(Jharkhand)కు చెందిన ఓ మీడియా సంస్థకు చెందిన న్యూస్ యాంకర్ సీరియస్‌గా బీహార్‌లోని పలు ప్రాంతాల్లో బాగ్మతి నది సృష్టించిన విధ్వంసాన్ని చదువుతోంది. ప్రత్యక్ష ప్రసారం (live streaming) జరుగుతోంది. ఇంతలో ఓ పదాన్ని సరిగ్గా ఉచ్చరించడం రాక యాంకర్ తప్పుగా పలికింది.
దీంతో ఒక్కసారిగా యాంకర్ (Anchor) నవ్వేసింది. ఇంతటి సీరియస్ వార్తలను లైవ్ టెలికాస్ట్ చెబుతూ నవ్వినందుకు పాపం.. యాంకర్ తీవ్రంగా విమర్శల పాలవుతోంది. బీహార్ రాష్ట్రంలోని తీవ్రమైన సమస్యకు సంబంధించిన వార్తల కవరేజీలో ఆమె హాస్యం వ్యక్తం చేసిందనేది చూసే జనాలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇందులో యాంకర్ ఉద్దేశ్యపూర్వకంగా నవ్వకపోయినప్పటికీ ఆన్ స్క్రీన్‌పై నవ్వడంతో ‘ఇందేందమ్మా మరీ అంత ఒళ్లుతెలియకుండా నవ్వుతున్నావ్..’ అంటూ విమర్శిస్తున్నారు. నిజానికి పదాన్ని తప్పుగా ఉచ్చరించడంతో యాంకర్ తనలో తాను నవ్వుకుంది. బీహార్‌లోని బాగ్మతి నది భీభత్సం సృష్టిస్తోంది. వరద నీరు (flood water) గ్రామాలపైకి దూసుకురావడంతో ఎందరో స్థానికులు నిరాశ్రయులయ్యారు. పంట పొలాలు ధ్వంసం అయ్యి, సర్వం పోగొట్టుకున్న స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం గడుపుతున్నారు.