»Rasi Khanna In A Backless Dress This Style Of The Actress Was Seen For The First Time
Rasi Khanna: బ్యాక్ ఓపెన్ చేసి, సొగసులు ఎరవేస్తున్న రాశి ఖన్నా..!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణుల్లో రాశీఖన్నా ఒకరు. మొదటి సినిమాలో ఆమెను చూడగానే కుర్రాళ్లు మనసు పారేసుకున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె వరసగా సినిమాలు చేస్తూనే ఉంది. కొంతకాలం పాటు ఆమె టాలీవుడ్ ని ఏలిందనే చెప్పొచ్చు. ఈ మధ్యకాస్త అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటోంది.
రాశీ ఖన్నా సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. తరచూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ, తన ఫ్యాన్స్ ని ఊరిస్తూ ఉంటుంది. కాగా తాజాగా కూడా కొన్ని ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోల్లో ఆమె అందాన్ని పొగడటానికి పదాలు కూడా సరిపోవడం లేదు. బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. అయితే ఆమె డ్రెస్ తో పాటు, ఆమె అందాలు మరింత మెరిసేలా కనిపించడానికి బంగారు ఆభరణాలు ధరించింది. అయితే, ఇక్కడ ఆమె బ్యాక్ అంతా ఓపెన్ చేసి పెట్టింది. అలా, ఆమె బ్యాక్ అందాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవడం లేదు. దీంతో, ఈ ఫోటోలు టూమచ్ హాట్ గా ఉన్నాయి. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోతున్నారు. హాట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఇంత హాట్ ఎప్పుడూ చూడలేదంటూ కామెంట్ప్ చేస్తున్నారు. మరో హాట్ హీరోయిన్ మృనాల్ ఠాకూర్ కూడా ఈ ఫోటోలకు రెస్పాండ్ అయ్యింది. బ్యూటిఫుల్ అంటూ కామెంట్ చేసింది. ఏది ఏమైనా ఈ ఫోటోలను చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. కాగా టాలీవుడ్ లో రాశి ఖన్నా చివరిగా థాంక్యూ మూవీలో నటించింది. నాగ చైతన్య జంటగా చేసిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. డిజాస్టర్ గా మారింది. తర్వాత ఆమెకు మళ్లీ తెలుగులో ఛాన్స్ రాలేదు. కాగా, షాహిద కపూర్ తో కలిసి ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించగా, అది బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో తమిళ సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మూవీ క్లిక్ అయితే, ఆమెకు మరిన్ని అవకశాలు వచ్చే అవకాశం ఉంటుంది.