హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు అరుదైన గుర్తింపు లభించింది. జాతీయ స్థాయిలో థర్డ్ ప్రైజ్ లభించింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ సదస్సులో అవార్డు అధికారులు స్వీకరించారు.
హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సరికొత్త ఘనతను దక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో అత్యున్నత అవార్డు లభించింది. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ఆధ్వర్యంలో స్టేట్ సైబర్ నోడల్ ఆఫీసర్స్ జాతీయ స్థాయి సదస్సును నిర్వహించింది. ఈ సదస్సులో భాగంగా హైదరాబాద్ సైబర్ పోలీసులకు మూడో అవార్డు అందించారు. టెక్నాలజీ సహాయంతో ఛేదించిన సైబర్ క్రైం కేసుల గురించి పోలీసులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ క్రమంలో మహేష్ బ్యాంక్ కేసును త్వరితగతిన చేధించినందుకు గాను ఈ అవార్డును హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ప్రధానం చేశారు. ఈ నేపథ్యంలో అవార్డు రావడం పట్ల ఈ డిపార్ట్ మెంట్ ను పలువురు ఉన్నాతాధికారులు ప్రశంసించారు. దీంతోపాటు నెజిటన్లు కూడా సంతోషం వ్యక్తం చేస్తు కామెంట్లు చేస్తున్నారు.