తమిళ యంగ్ హీరో అశోక్ సెల్వన్ (Hero Ashok Selvan) ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు కీర్తి పాండియన్ మెడలో మూడుముళ్లు వేశాడు. వీరి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. సెప్టెంబర్ 13న తిరునల్వేలి(Tirunalveli)లో కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ వివాహ వేడుకలు జరిగాయి. బ్లూ స్టార్’ మూవీ(Blue Star’ movie)లో వీరిద్దరూ కలిసి నటించారు. అశోక్ సెల్వన్ గతేడాది సూపర్ హిట్ మూవీ పోర్ థోజిల్తో పాటు 5 సినిమాల్లో నటించారు.
తెలుగులో నిన్నిలా నిన్నిలా సినిమా(Ninila Ninila movie)చేశారు. నవరస, మోడ్రన్ లవ్ చెన్నై అనే వెబ్ సిరీస్‌లలోనూ నటించారు. బ్లూ స్టార్ మూవీ రిలీజ్ కాకముందే కుటుంబసభ్యుల అనుమతితో అశోక్ సెల్వన్, కీర్తి పాండియన్ (Kirti Pandian)పెళ్లిపీటలెక్కారు. ఈ ఏడాది పోర్ తొళిల్ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు అశోక్ సెల్వన్. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో అతి భయస్తుడైన పోలీస్ ఆఫీసర్‌గా అతడి నటనకు ప్రశంసలు దక్కాయి. తెలుగులో నిన్నిలా నిన్నిలా అనే సినిమాలో హీరోగా నటించాడు. విశ్వక్సేన్ (Vishvaksen) అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో అశోక్ సెల్వన్ గెస్ట్ పాత్రలో కనిపించాడు.ఈ సందర్భంగా వారికి సినీ ప్రముఖులు, అభిమానులు విషెస్ తెలియజేస్తున్నారు.