Ustad Bhagat Singh: ఎంతపనైంది ‘ఉస్తాద్’.. బాబు వల్ల మళ్లీ బ్రేక్!
రీ ఎంట్రీ తర్వాత పవన్ వరుస సినిమాలు కమిట్ అయ్యారు. కానీ డేట్స్ మాత్రం అనుకున్న సమయానికి అడ్జెస్ట్ చేయలేకపోతున్నారు. అయినా కూడా రీసెంట్గా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్టార్ట్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో మళ్లీ షూటింగ్ ఆగిపోయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్, పవన్ కాంబోలో వస్తున్న సినిమా ఇదే. పవన్ కోసం హరీష్ చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత.. ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్లింది ఉస్తాద్ భగత్ సింగ్. ఇప్పటికే రెండు మూడు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. అయితే పవన్ పొలిటికల్ కారణంగా ఈ సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి జరగడం లేదు. పైగా ఓజి సినిమాను కూడా పరుగులు పెట్టిస్తున్నారు పవన్. దీంతో ఉస్తాద్ గత రెండు మూడు నెలలుగా వాయిదా పడుతూ వస్తోంది.
ఫైనల్‌గా ఓ పవర్ ప్యాక్డ్ యాక్షన్ షెడ్యూల్‌ను రీసెంట్‌గానే స్టార్ట్ చేశారు. వచ్చే ఎలక్షన్స్ లోపు ఉస్తాద్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో.. పవన్ అనుకోకుండా డేట్లు ఇవ్వడంతో రెండు మూడు రోజుల క్రితమే ఉస్తాద్ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు. మేకర్స్ ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తూ సాలిడ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఓ వారం పది రోజులు ఈ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. కానీ ఊహించని విధంగా మళ్లీ ఉస్తాద్ షూటింగ్‌కు బ్రేక్ పడిపోయింది.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో.. షూటింగ్ స్పాట్ నుంచే పవన్ సడెన్‌గా విజయవాడ బయల్దేరినట్లు సమాచారం. ఈ షెడ్యూల్‌ను పవన్ లేకుండా షూటింగ్ చేయలేరని తెలుస్తోంది. దీంతో పవన్ తిరిగి ఉస్తాద్ సెట్స్‌లోకి ఎప్పుడు అడుగుపెడతారనేది ఇప్పుడే చెప్పలేమంటున్నారు. కానీ వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు పవన్. అందుకే లేటెస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్గా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.