మొరాకో(Morocco)లో ఘోర భూకంపం సంభంవించిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడు వందల మంది మృతి చెందారు.అయితే ఆ బీభత్సానికి చెందిన వీడియోలు ఇప్పడిప్పుడే బయట వస్తున్నాయి. శుక్రవారం రాత్రి 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం (Earthquake)వల్ల చాలా నగరాల్లో బిల్డింగ్లు కూలిపోయాయి. మర్రాకెచ్ (Marrakech) నగరంలో ఆ ప్రకృతి చేసిన నష్టం మరీ ఎక్కువగా ఉంది. ఓ భవనం కూలిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. రాత్రి 11 గంటల సమయంలో భూకంపం సంభవించింది. అయితే ఆ సమయంలో ఓ బిల్డింగ్ వద్ద ఉన్న జనం అటూ ఇటూ పరుగులు తీశారు. ఆ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం ఉరకలు పరుగులు పెట్టారు. భూకంప బాధితుల (Earthquake victims) సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది.ఇళ్లల్లో ఉన్న వారు బయటకు పరుగులు తీయగా, కొందరు భయంతో వీధుల్లోంచి ఇళ్లల్లోకి పారిపోతున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
భవనాలు కదిలిపోవడం, శిథిలాలు కూలిపోవడం వీడియోల్లో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు (Videos) ప్రస్తుతం వైరలు అవుతున్నాయి.ఈ విపత్తు (Disaster) లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 820కి చేరింది. మరో 672 మంది గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం వెల్లడించింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.మొరాకో(Morocco)లో భూకంపం(Earthquake)పై ప్రధాని మోదీ స్పందించారు. ఈ భూకంపం వల్ల వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో మొరాకో ప్రభుత్వంతో కలిసిపనిచేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. మొరాకోకు సమష్టిగా సాయం చేయాలని జీ20 ప్రారంభోపన్యాసంలో కూడా మోదీ పిలుపునిచ్చారు.