చంద్రబాబు అరెస్టుపై వ్యవహారంపై సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం. నాగేశ్వరరావు (M. Nageswara Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్ (Governor) అనుమతి లేకుండా అరెస్ట్ చేయడం, దర్యాప్తు చేపట్టడం చట్టవిరుద్ధమని ఆయన తెలిపారు.అవినీతి శాఖ చట్టం(ACB ACT)లోని 17ఎ(సి) సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తప్పనిసరి అన్నారు. గవర్నర్ అనుమతిని సీఐడీ (CID) పోలీసులు తీసుకున్నారా లేదా అనే దానిపై స్పష్టత లేదన్నారు. గవర్నర్ అనుమతిస్తే ఆ పత్రలివ్వాలని దర్యాప్తు అధికారులను అడగాలన్నారు. చంద్రబాబు (Chadrababu) అరెస్ట్‌కు గవర్నర్ అనుమతి తీసుకున్నారా లేదా అనే దాని పై క్లారీటి లేదని ఆయన అన్నారు.
గవర్నర్ పర్మిషన్ లేకపోతే దర్యాప్తు చెల్లుబాటు కాదని ఆయన తెలిపారు. నంద్యాల(Nandyala)లో చంద్రబాబును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ అధికారులు విజయవాడకు తరలిస్తున్నారు. అయితే కాన్వాయ్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట(Chilakaluripet)కు చేరుకోగానే టీడీపీ శ్రేణులు కార్లు అడ్డుపెట్టి కాన్వాయ్‌ని ఆపేశారు. ప్రధాన రహదారిపై టైర్లు తగలపెట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు టీడీపీ (TDP) ఆందోళనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడంపై నందమూరి రామకృష్ణ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం (YCP GOVT) ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు.