బిగ్ బాస్ సీజన్7 (Bigg Boss Season 7) పై ప్రేక్షకులకు ఇంకా క్లారిటీ రావడం లేదు. తాజాగా ప్రారంభమయిన ‘బిగ్ బాస్’ సీజన్ 7లో రెండు ప్రేమజంటలు ఉన్నట్టుగా అనిపిస్తోంది. వారే గౌతమ్ కృష్ణ (Gautam Krishna), శుభశ్రీ ఇంకా రతిక, పల్లవి ప్రశాంత్. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే వచ్చిన మొదటిరోజే రతిక(Rathika).. తన లేడీ లక్ అంటూ బ్యాండ్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా వీరిద్దరూ మాత్రమే ఎప్పుడూ కలిసి కనిపిస్తారు. అయితే అసలు పల్లవి ప్రశాంత్(Pallavi Prashant)పై రతికకు ఉన్న ఫీలింగ్ ఏంటి? అనేది నేటి (సెప్టెంబర్ 8న) ప్రసారమైన ఎపిసోడ్లో బయటపడింది. హౌస్ మేట్స్ (House mates) అంతా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో.. సడన్ గా ప్రశాంత్‌ను బాబాయ్ అని పిలిచింది రతిక. ఆ పిలుపుకి ఒక్కసారిగా అవాక్కైన ప్రశాంత్ హార్ట్ అయ్యి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఎందుకు అలా వచ్చేశావ్, బాబాయ్ అని పిలిస్తే ఏంటి, ఎందుకు అంతలా ఫీలవుతున్నావు అంటూ ఇతర కంటెస్టెంట్స్(Contestants) ప్రశాంత్ ను ప్రశ్నించారు. దానికి.. సందర్భం వచ్చినప్పుడు చెప్తా అంటూ మాట దాటేశాడు ప్రశాంత్. కాసేపటికి రతిక కూడా ప్రశాంత్‌ను అడిగింది.. ఎందుకు అంత ఫీల్ అవుతున్నావ్. అసలు నీ ఫీలింగ్ ఏంటి? అని అడిగింది. అప్పుడు కూడా సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయాడు ప్రశాంత్. దీంతో రంగంలోకి దిగిన శుభ శ్రీ (Subha sri).. రతిక, ప్రశాంత్ మధ్య ఏముందో క్లారిటీగా తెలుసుకోవడానికి ప్రయత్నించింది. ప్రశాంత్ అంటే వ్యక్తిగతంగా నాకు ఇష్టమే.. కానీ అదంతా గేమ్ వరకు మాత్రమే. ఒక ఫ్రెండ్‌లాగా.. తనకు కూడా నిన్నటి ఇష్టమే కానీ.. అది నిజమా లేదా గేమ్ వరకేనా అనేది క్లారిటీ లేదు.. అడిగితే కూడా చెప్పడం లేదు.. అంటూ క్లారిటీ ఇచ్చేసింది రతిక.‘‘అయితే ఇదంతా చూస్తున్న ఆడియన్స్ (Audience) మాత్రం కాస్త ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు. వచ్చిన మూడు రోజులకే ప్రేమ, ఫీలింగ్స్(Feelings), రిలేషన్స్ ఏంట్రా బాబు.. మతి గాని పోయిందా. ఉల్టా పుల్టా ఆంటీ ఈ సీజన్ అయినా కొత్తగా ఉంటుందనుకుంటే.. మాకీ ఖర్మ ఏంట్రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.