»Sharukh Khan Starrer Jaawan Crosses Rs 200 Crores In Two Days
Jawan: రూ.200 కోట్ల క్లబ్లో జవాన్ మూవీ..రూ.500 దిశగా..
షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. విడుదలైన రెండు రోజులకే రూ.200 కోట్ల క్లబ్లో చేరింది. మరో సారి బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ సత్తా ఏంటో చూపించి రూ.500 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తుంది.
sharukh khan Starrer Jaawan Crosses Rs 200 Crores in Two Days
sharukh khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్(Sharukh khan) హీరోగా నటించిన తాజా చిత్రం జవాన్. అట్లీ(Atlee) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తొలి రోజు నుంచే రికార్డుల బరిలో దిగింది. హిందీ సినిమా చరిత్రలోనే మొదటిరోజు అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు తిరగరాసింది. ఇక రెండో రోజు శుక్రవారం కూడా బాక్సాఫీస్(Boxoffice) వద్ద అదే జోరును కొనసాగించింది. ఇండియాలోనే ఈ సినిమా రెండో రోజు రూ.53 కోట్ల నెట్ వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. గత చిత్రం పఠాన్ ఓపెనింగ్ కలెక్షన్లకు సమానంగా ఉన్నాయని తెలుస్తోంది.
ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.129.6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు కూడా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. రెండో రోజు రూ.107 కోట్ల గ్రాస్‌తో ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లోనే జవాన్ గ్రాస్ కలెక్షన్స్ రూ.236 కోట్లకు చేరిందని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు. ఇక భారత్‌లో రెండు రోజుల్లో జవాన్ వసూలు చేసిన నెట్ కలెక్షన్స్ రూ.127 కోట్లుగా ఉంది. తొలిరోజు భారత్ బాక్సాఫీసు వద్ద రూ.74 కోట్ల నెట్ వసూలు చేయగా.. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ రెండవ రోజు రూ.53 కోట్ల నెట్ రాబట్టింది.
ఇక ఈ మూవీ మొదటి రోజు నుంచే మంచి థియేటర్ అక్యూపెన్సీతో తెలుగు రాష్ట్రాల్లో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తగా రూ.200 కోట్లకు పైగానే గ్రాస్ వసూళ్లు చేసిన ఈ చిత్రం లాంగ్ రన్లో ఏ మేరకు కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి. ఈ చిత్రంలో నయనతార(Nayanathara), విజయ్ సేతుపతి(Vijay sethupathi)తో పాటు దీపికా పదుకొనే, సునీల్ గ్రోవర్ సహా పలువురు నటీనటులు ప్రధాన పాత్రల్లో యాక్ట్ చేశారు.