»Brussels Opposition Agrees With Bjp Government Position On Ukraine Rahul Gandhi
Rahul Gandhi: మోదీ తీసుకున్న నిర్ణయాన్ని మెచ్చుకున్న రాహుల్ గాంధీ
యూరప్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ ఓ అంతర్జాతీయ మీడియాతో భారత్‌కు సంబంధించిన పలు విషయాలను చర్చించారు. మోడీ ప్రభుత్వం గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. జీ20 సదస్సుకు విపక్షనేతను పిలవకపోవడం కరెక్ట్ కాదన్నారు.
Brussels opposition agrees with bjp government position on ukraine rahul gandhi
Rahul Gandhi: రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) వివాదంపై బీజేపీ(BJP) ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు ఏకీభవిస్తున్నట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రకటించారు. భారత్ పెద్ద దేశం కాబట్టి అనేక ద్వైపాక్షిక సంబంధాలు ఉండటం మంచిదన్నారు. యూరప్(Europe) పర్యటనలో భాగంగా బ్రసెల్స్(Brussels) ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై మోదీ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరి, రష్యా నుంచి చమురు కొనుగోలు తదితర అంశాలపై ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు.
దీనికి రాహుల్ మాట్లాడుతూ భారత్ ప్రదర్శించిన స్వతంత్ర వైఖరి సరైనదేనన్నారు. భారత్‌కు రష్యాతో మంచి సంబంధాలు ఉన్నాయని, అమెరికాతోను మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. తమ దేశానికి ఎవరితోనైనా సంబంధాలు కలిగి ఉండే హక్కు ఉందన్నారు. అంతర్గత విషయాలపై మాట్లాడుతూ.. కశ్మీర్ అభివృద్ధి, పురోగతిపై ప్రతిపక్షాలు కట్టుబడి ఉన్నాయన్నారు. ఆర్టికల్ 370పై తమకు స్పష్టత ఉందన్నారు. కశ్మీర్ అభివృద్ధి చెందాలని, పురోగమించాలని, అక్కడ శాంతి నెలకొనాలని మేము చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని పేర్కొన్నారు. అలాగే జీ20 సదస్సుకు విపక్ష నేతను పిలవకపోవడం, 60 శాతం మందికి ప్రాతినిథ్యం వహిస్తున్న వారిని అవమానించడమే అని అన్నారు. విపక్ష నేత ఖర్గేను పిలువాల్సిందని, కాని వారు ఏం ఆలోచిస్తున్నారో అని తన అభిప్రాయాన్ని తెలిపారు. అలాగే భారత్‌లో పెరుగుతున్న హింస, వివక్షత పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య సంస్థలపై పూర్తిస్థాయిలో దాడి జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.