TPT: తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం గతేడాది ఏప్రిల్లో డిగ్రీ B.A, B.Com, B.Sc మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్ పరీక్షలు జరిపింది. ఈ మేరకు సంబంధిత రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదలైనట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారి రాజమాణిక్యం పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.