»Bigg Boss Season 7 Nominations Promo Started Who Will Vote For You
Bigg Boss Telugu 7: సీజన్లో మొదలైన నామినేషన్ల పర్వం..మీ ఓట్ ఎవరికి?
ఎన్నో అంచనాల తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభమైంది. అయితే ఇటివల రిలీజ్ చేసిన వీడియోలో మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ మొదలైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫస్ట్ వీక్ ఎవరు బయటకు వచ్చే ఛాన్స్ ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి మరి.
Bigg Boss season 7 nominations promo started Who will vote for you
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు ఏడవ సీజన్(Bigg Boss Telugu 7)సెప్టెంబర్ 3న గ్రాండ్ ఓపెనింగ్‌తో ప్రారంభమైంది. అయితే నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. హౌస్మేట్స్ ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ల తర్వాత ప్రేక్షకులను ఆకర్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సీజన్ మొదటి నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇటివల వచ్చిన ప్రొమో వీడియోలో హౌస్మేట్స్ మొదటి నామినేషన్ టాస్క్‌లో పాల్గొన్నారు. ప్రతి హౌస్‌మేట్ తప్పనిసరిగా ఆ నివాసం విడిచి వెళ్లమని ఇద్దరు వ్యక్తులను ఎంచుకోవాలి. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్రమైన వాదనలతో నామినేషన్లు వేసుకుంటున్నారు. ఈ వారంలో ఏడుగురు పోటీదారులు నామినేషన్లు స్వీకరిస్తారని తెలుస్తోంది.
వాగ్వాదం
మరో ప్రోమోలో పోటీదారులు శోభా శెట్టి, ధామిని కోపంగా వాదించుకోవడం కనిపించింది. ఆమెను నామినేట్(nominations) చేయడానికి ధామిని పనికిమాలిన సమర్థనగా ఆమె భావించిన కారణంగా, శోభ కలత చెందింది. గౌతం కృష్ణ, శోభ మధ్య కూడా విభేదాలు వచ్చాయి. మరికొందరు కిరణ్ రాథోడ్‌కు ఓటు వేయడానికి ఎంచుకున్నారు. ఆమె భాష వారికి ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. దీంతోపాటు మరికొంత మంది కూడా పలు రకాల కారణాలు చూపుతు నామినేట్ చేసుకున్నారు. మరి ఈ ప్రక్రియలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయి? ఎవరు మొదటి వారం నామినేట్ అవుతారో చూడాలి. అయితే మీ ఓట్ ఎవరికి వేస్తారో కామెంట్ రూపంలో తెలియజేయండి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రియాలిటీ షోకు మొదట విజయ్ దేవరకొండ, నవీన్ పోలిశెట్టి వచ్చి తమ చిత్రాలైన ఖుషీ, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలను ప్రమోట్ చేసుకున్నారు. ఐదుగురు కంటెస్టెంట్స్‌కి ప్రీమియర్‌లోనే ప్రైజ్ మనీ(prize money) ఉన్న సూట్‌కేస్‌తో బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఆఫర్ ఇచ్చారు. ఈ ఏడాది బిగ్ బాస్ హౌస్‌లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ప్రవేశించారు. ఈ కార్యక్రమం రాత్రి 9.30 గంటలకు ప్రసారం కానుంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు, శనివారం, ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.