హీరోయిన్ అనుష్క (Anushka) విసిరిన రెసిపీ ఛాలెంజ్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ స్వీకరించారు. ‘స్వీటీ నాకు దశాబ్దాలుగా తెలిసినా.. తనకు ఇష్టమైన రెసిపీ ఏంటో తెలియదు. ఇప్పుడు నాకు తెలిసింది. నాకు ఇష్టమైన వంటకం రొయ్యల పులావ్‌ను ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కి రెసిపీ ఛాలెంజ్ విసురుతున్నా. నా అభిమానులందరూ వారికి ఇష్టమైన వంటకాలను నాతో పంచుకోండి’ అని ప్రభాస్ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అనుష్క, నవీన్ పొలిశెట్టి (Naveen Policetty) నటించిన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (MrPolichetti) చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
సెప్టెంబరు 7న ఈ ఎంటర్టయిన్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్రబృందం వినూత్న రీతిలో రెసిపీ చాలెంజ్(Recipe Challenge) ప్రారంభించింది. ఈ చిత్రంలో అనుష్క ఓ చెఫ్ పాత్ర పోషించిన నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఫుడ్ రెసిపీ చాలెంజ్ ను విస్తృతం చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా అనుష్క మంగళూరు చికెన్ కర్ మంగళూరు (Mangalore) నీర్ దోసె రెసిపీలను పంచుకున్నారు. అనంతరం ఈ చాలెంజ్ ను స్వీకరించాలంటూ హీరో ప్రభాస్ (Hero Prabhas)ను నామినేట్ చేశారు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చాలెంజ్ ను మరింత ముందుకు తీసుకెళ్లండి” అంటూ అనుష్క పిలుపునిచ్చారు.