మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసనలు ఇటీవల తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే ఉపాసన జూన్ 20న పండంటి పాపకు జన్మనిచ్చారు తెలిసిందే. దీంతో మెగా ఇంట ఆనందం వెల్లివిరుస్తోంది. చిన్నారికి క్లీంకార (Klinkara) అని నామకరణం చేశారు.పెళ్లయిన పదకొండేళ్ల తర్వాత పుట్టిన తొలి సంతానం కావడంతో రామ్ చరణ్, ఉపాసన ఆనందానికి అవధుల్లేవు. ప్రస్తుతం శ్రావణ మాసం (Sravana masam). ఇవాళ శ్రావణ శుక్రవారం సందర్భంగా తన నివాసంలో తొలిసారిగా వరలక్ష్మి వ్రతం (Varalakshmi Vratam) నిర్వహించినట్టు ఉపాసన వెల్లడించారు.
ఈ వ్రతంలో తనతో పాటు కుమార్తె క్లీంకార కూడా పాల్గొన్నట్టు తెలిపారు. ఇంతకంటే ఇంకేమీ కోరుకోని అంటూ ఆ మేరకు ఎక్స్ (Twitter)లో పోస్టు చేశారు. వ్రతానికి సంబంధించిన ఫొటోను కూడా ఉపాసన పంచుకున్నారు. తన ఒళ్లో క్లీంకారను కూర్చోబెట్టుకుని ఫొటో తీయించుకున్నారు. అయితే ఫొటోలో క్లీంకార ముఖం కనిపించకుండా, ఎమోజీతో కవర్ చేశారు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.ఇదిలా ఉంటే.. తమిళ దర్శకుడు శంకర్ (Shankar) డైరెక్షన్ రామ్చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తమన్ (Taman) సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది.