పబ్లిక్ ప్లేసులో హుందగా ప్రవర్తించాలి, బైక్ లేదంటే కారులో ఉన్నప్పుడు చక్కగా ఉండాలి. కొందరు అలా ఉండటం లేదు.. రెచ్చిపోతున్నారు. ట్రావెల్ చేసే సమయంలో రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల పలు వీడియోలు సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యాయి. ఇప్పుడు అలాంటి మరో వీడియో వచ్చింది. ఓ జంట పబ్లిక్ ప్లేసులో రెచ్చిపోయింది. లక్నోలో గల హజరత్ గంజ్‌లో బైక్ వెళుతున్న యువతీ, యువకుడు డ్రైవ్ చేస్తూ రొమాన్స్ చేశారు. వారి చేష్టలను ఒకరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది వైరల్ అవుతుంది. ఆ వీడియో నిజమేనని పోలీసులు కూడా ధృవీకరించారు. విచారణ చేపట్టామని వెల్లడించారు.
బైక్ మీద కపుల్ వెళ్తున్నారు. ఆ యువకుడి ఒడిలో ఆమె కూర్చొంది. ఇలా కూర్చొవడమే తప్పు.. అలా అని తిన్నగా ఉండకుండా.. అతనిని ముద్దులతో ముంచెత్తింది. దీనిని ఒకరు వీడియో తీశారు. లిప్ లాక్ చేసేందుకు కూడా ట్రై చేసినట్టు వీడియో చూస్తే కనిపించింది. పబ్లిక్ ప్లేసులో, డ్రైవింగ్ చేస్తూ.. ఇదేం పోయేకాలం అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జంట తీరు సరికాదని కామెంట్ చేస్తున్నారు. రెప్పపాటులో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. వారికే కాదు.. వెనకాల వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉంది. అలాంటి సమయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉంటారని ఫైర్ అవుతున్నారు. ఇన్సిడెంట్‌పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ కపుల్‌ను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. సమీపంలో గల సీసీ కెమెరాలను వారు చెక్ చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో రొమాన్స్, మోటార్ వెహికిల్స్ యాక్ట్ ఉల్లంఘన కింద కేసు నమోదు చేశామని లక్నో సెంట్రల్ జోన్ డీసీపీ అపర్ణ రాజత్ కౌశిక్ తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.