తమిళ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)కు కేరళ ఎన్ఐఏ (NIA) అధికారులు నోటీసులిచ్చారు. డ్రగ్స్ కేసులో ఆమె పీఏ ఆదిలింగం పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో కేరళ ఎన్ఐఏ అధికారులు డ్రగ్స్ కేసు (Drugs Case)కు సంబంధించి వరలక్ష్మి శరత్ కుమార్‌కు నోటీసులు పంపారు. ఈ కేసు ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. కేరళలోని విలన్జియం సమీపంలో ఆదిలింగం డ్రగ్స్‌తో పట్టుబడ్డారు.
ప్రస్తుతం ఆదిలింగం (Adilingam) పైన ఎన్ఐఏ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)కు సంబంధం ఉందా? లేదా? అనే కోణంలో ఎన్ఐఏ (NIA) అధికారులు విచారణ చేయనున్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్‌కు పిఏగా పనిచేసిన ఆదిలింగం గతంలో అనేకసార్లు ఆమెకి డ్రగ్స్ ఇచ్చినట్లుగా ఎన్ఐఏ (NIA) అనుమానిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ అమ్మగా వాటి ద్వారా వచ్చిన డబ్బును సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. దీంతో ఆయనకు సంబంధించిన అనేక విషయాలపై పూర్తిస్థాయిలో సమాచారం రాబట్టడం కోసం విచారణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు వరలక్ష్మి శరత్ కుమార్‌కి నోటీసులు జారీ చేశారు.