ఒకే ఒక్క టీజర్ ఆదిపురుష్ పై ఉన్న అంచనాలను రివర్స్ చేసేసింది. పాన్ ఇండియా హీరోని పెట్టుకొని.. అదేం గ్రాఫిక్స్ రా బాబు.. అంటూ దర్శకుడు ఓం రౌత్ పై మండి పడ్డారు నెటిజన్స్. దాంతో చేసేదేం లేక.. ఈ సినిమాను మరో ఆరు నెలలు పోస్ట్ పోన్ చేశాడు. అయినా కూడా జూన్‌లో ఈ సినిమా రిలీజ్ అవుతుందనే గ్యారంటీ లేదంటున్నారు. కానీ లేటెస్ట్ అప్టేట్ మాత్రం.. ఈ సారి అనుకున్న సమయానికే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆదిపురుష్ కోసం పెట్టిన బడ్జెట్ కంటే అదనంగా.. మరో వంద కోట్లు ఖర్చు చేసి.. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ చేస్తున్నాడు ఓం రౌత్. ఈ నేపథ్యంలో.. ఆదిపురుష్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ పళని చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆదిపురుష్ టీజర్‌కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిన మాట నిజమే.. అయితే ఈసారి మాత్రం విజువల్స్ పరంగా మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని చెప్పుకొచ్చాడు. సినిమాలో చాలా మార్పులు వచ్చాయని, ఇది అవుట్ అండ్ అవుట్ బ్లూ స్క్రీన్ మూవీ అని అన్నాడు. నటీనటులు మాత్రమే మా ముందుంటారు.. దాని చుట్టు ప్రపంచం ఎలా ఉండబోతోందని తాము ఊహించుకుని షూట్ చేయాల్సి ఉంటుందని.. ఆ అనుభూతిని మాటల్లో వర్ణించలేనని తెలిపాడు కార్తిక్. మొత్తంగా ఆదిపురుష్‌లో ఎంతో ఇంప్రూవ్మెంట్ జరిగింది.. సినిమా చూశాక మీకే తెలుస్తుంది.. ఇప్పటి వరకు చూసిన దాని కంటే భిన్నంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. దాంతో ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో గట్టిగానే మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మరి ఈసారైనా ఓం రౌత్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తాడేమో చూడాలి.